కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కరుణశ్రీ, జూన్ 1 నుండి 5వ తేదీ వరకు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీకాకుళంలో శనివారం విడుదల చేసిన ప్రకటనలో, వచ్చే నెల 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయని ఆమె వివరించారు. కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు.