శ్రీకాకుళం: రీ సర్వేలో తప్పులు.. ఒకే వ్యక్తి పేరున 250 ఎకరాలు!

1చూసినవారు
శ్రీకాకుళం: రీ సర్వేలో తప్పులు.. ఒకే వ్యక్తి పేరున 250 ఎకరాలు!
సోంపేట(M) కొర్లం గ్రామానికి చెందిన 70 మంది రైతులు సోమవారం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. 2023లో జరిగిన రీ సర్వేలో తమకు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా ఒకే వ్యక్తి పేరుపై సుమారు 250 ఎకరాల భూమిని నమోదు చేశారని వారు ఆరోపించారు. తమ వద్ద ఉన్న డాక్యుమెంట్స్ చూపిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్