శ్రీకాకుళం పట్టణంలోని అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దర్శనానికి సంబంధించిన పాసులు నకిలీవని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వీఐపీ పాసులు, రూ.500 క్షీరాభిషేక టికెట్లు నకిలీగా ముద్రించారని విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు జిరాక్స్, ఫ్లెక్సీ సెంటర్లలో సోదాలు నిర్వహించినట్లు సమాచారం. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ల ప్రమేయం కూడా ఉన్నట్లు ఆరోపణలున్నాయి.