శ్రీకాకుళం: గీత కార్మికుడు మృతి

3చూసినవారు
శ్రీకాకుళం: గీత కార్మికుడు మృతి
శ్రీకాకుళం గ్రామీణ మండలం బట్టేరులో గురువారం తాటి చెట్టుపై నుంచి జారిపడి పెంటబోయిన అప్పారావు (45) అనే గీత కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రం స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని నగరంలోని సర్వజనాసుపత్రికి తరలించారు. మృతుడి భార్య తవిటమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై కె.రాము తెలిపారు.

సంబంధిత పోస్ట్