శ్రీకాకుళం: మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది: ఎమ్మెల్యే

59చూసినవారు
శ్రీకాకుళం: మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది: ఎమ్మెల్యే
మత్సకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని, శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు. శంకర్ అన్నారు. శ్రీకాకుళం నగర పరిధి మత్స్యశాఖ ఆఫీసులో మత్సకారులకు, సబ్సిడీతో లభించిన బోటు ఇంజన్ పరికరాలను ఆయన అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నిరుపేదల ప్రభుత్వమని, ప్రజల శ్రేయస్సు కోసం పరితపించే నాయకులు ముఖ్యమంత్రి అని అన్నారు. అహర్నిశలు ప్రజల కోసం ఆలోచిస్తూ, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, విద్యా విభాగం, ప్రజారోగ్యం, అన్ని కులస్తులకు అండగా ఉంటున్న ప్రభుత్వమని అన్నారు.

సంబంధిత పోస్ట్