శ్రీకాకుళం రూరల్ మండలం తండెంవలస పోలీస్ శిక్షణ కేంద్రంలో రెండో రోజు క్రీడలు కొనసాగాయి. గురువారం మధ్యాహ్నం మహిళా పోలీసులు, హోం గార్డులు కబడ్డీ పోటీల్లో పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన మహిళా పోలీసులు ఉత్సాహంగా ఆటల్లో పాల్గొన్నారు. ఈ క్రీడను ఎంచుకోవడం ఆనందదాయకమని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.