ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు రేపటి నుండి నిర్వహించనున్న ఎఫ్ఎల్‌ఎన్ శిక్షణ కేంద్రాల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని యుటిఎఫ్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. ఈ మేరకు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కిషోర్ కుమార్, జిల్లా కార్యదర్శి బమ్మిడి శ్రీరామమూర్తి, సభ్యులు బుధవారం డీఈవో ఏ రవి బాబుకు వినతి పత్రం సమర్పించారు. వేసవి కాలం దృష్ట్యా కేంద్రాల వద్ద తగు చర్యలు తీసుకోవాలని వారు కోరారు.