శ్రీకాకుళం: జడ్పీ ఇన్చార్జ్ సీఈవోగా కిరణ్ కుమార్

0చూసినవారు
శ్రీకాకుళం: జడ్పీ ఇన్చార్జ్ సీఈవోగా కిరణ్ కుమార్
శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఇన్చార్జి సీఈవోగా పి కిరణ్ కుమార్ ను నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సీఈఓగా ఉన్న సత్యనారాయణ 13 రోజులపాటు విజయవాడలో జరిగే ప్రత్యేక శిక్షణా తరగతులకు హాజరవుతున్నందున, డిఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ కు ఈ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ నియామకం సోమవారం సాయంత్రం ఆయన విడుదల చేసిన ఆదేశాలలో వెల్లడైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్