భవన నిర్మాణ పనులు చేస్తుండగా లిఫ్ట్ వైర్ తెగి ప్రమాదంలో ఇద్దరు కార్మికులు చనిపోయిన ఘటన శ్రీకాకుళంలోని పి.ఎన్.కోలనిలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కార్మికులు పనులు ముగించుకొనిపై నుంచి కిందకు దిగేందుకు లిఫ్ట్ ఎక్కి స్విచ్ ఆన్ చేయగా వెంటనే వైర్ తెగి లిఫ్ట్ పడిపోయింది. ఈ ఘటనలో ఎచ్చెర్లకు చెందిన సూర్యనారాయణ(53),ముఖలింగం(55) మృతి చెందారు. శ్రీకాకుళం టూ టౌన్ పోలీసు కేసు నమోదు చేశారు.