శ్రీకాకుళం: సీఎన్‌జీని సద్వినియోగం చేసుకోండి

79చూసినవారు
కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళంలో కోరారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌తో కలిసి శనివారం 80 అడుగుల రోడ్డులోని పౌర సరఫరాల సంస్థ పెట్రోల్ బంకులో సీఎన్‌జీ పంప్‌ను ఆయన ప్రారంభించారు. సీఎన్‌జీ వల్ల కాలుష్యం ఉండదని, కిలో ధర రూ. 91 మంత్రి తెలిపారు. వాహనాల్లో సీఎన్‌జీ నింపే ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్