శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని బృందావన్ ఫంక్షన్ హాల్‌లో పోలీస్ సిబ్బంది కోసం మెడిటేషన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నిత్యం ఒత్తిడికి లోనవుతున్న పోలీసులకు ఉపశమనం కలిగించడమే ఈ శిక్షణ లక్ష్యమని డీఎస్పీ వివేకానంద తెలిపారు. ఈ నెల 25 నుండి 27వ తేదీ వరకు కొనసాగే ఈ శిక్షణను పోలీస్ సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.