శ్రీకాకుళం రూరల్ మండలం అరసవెల్లి, ఖాజీపేట గ్రామాలలో నిర్వహించనున్న సిరిమాను ఉత్సవాలలో భాగంగా అంకురార్పణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే గోండు శంకర్రావు మంగళవారం ప్రారంభించారు. సిరిమానుకు కుంకుమ తిలకం దిద్ది దీవెనలు అందుకున్న ఆయన, వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో జరిగే సిరిమాను పండుగను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, గ్రామస్తుల సహకారం ఉందని తెలిపారు.