శ్రీకాకుళం రూరల్ మండలం లింగాలవలస గ్రామం నుంచి రాగోలు ఎస్‌ఎస్ వలస బీటి రోడ్డు వరకు రూ.38 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణ పనులను శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పూజలు చేసి ప్రారంభించారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల లింగాలవలస నుంచి శ్రీకాకుళం చేరుకునే దూరం సుమారు 4 కిలోమీటర్లు తగ్గుతుందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఆర్ఎంసి 27 ఇయర్ వద్ద పైపు కల్వర్టు, రాగోలు పంచాయతీ ప్రధాన రహదారిలో కాల్వ పనులను పరిశీలించి, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ నాయకులు, ఇంజనీర్లు, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.