శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని అరసవిల్లిలో మంగళవారం ఘనంగా జరుగుతున్న అసిరి తల్లి సిరిమానోత్సవం కార్యక్రమంలో ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ పాల్గొన్నారు. ఆయనకు స్థానిక నాయకులు, నిర్వాహకులు స్వాగతం పలికారు. 10 సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ ఉత్సవాలలో పాల్గొనడం ఆనందంగా ఉందని, కార్యక్రమం విజయవంతం కావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.