ఎచ్చెర్ల మండలం షేర్ మహమ్మద్ పురం గ్రామానికి చెందిన శివ నాగ గౌరి ఇటీవల విడుదలైన గ్రూప్ వన్ ఫలితాలలో డీఎస్పీగా ఎంపికయ్యారు. గురువారం శ్రీకాకుళంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆమెను ఎమ్మెల్యే గోండు శంకర్రావు అభినందించారు. జల వనరుల శాఖలో ఏఈఈగా పనిచేస్తూనే గ్రూప్ వన్ లో విజయం సాధించడం అభినందించదగ్గ విషయమని, సివిల్స్ కు ప్రయత్నించాలని ఎమ్మెల్యే సూచించారు.