శ్రీకాకుళం: "మానసిక రోగుల వైద్యంలో మరింత చొరవ చూపాలి"

84చూసినవారు
శ్రీకాకుళం: "మానసిక రోగుల వైద్యంలో మరింత చొరవ చూపాలి"
జిల్లాలో అధిక సంఖ్యలో నమోదవుతున్న మానసిక రోగుల ఆరోగ్య సమస్యల చికిత్సల పట్ల వైద్యులు మరింత చొరవ చూపాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్ జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. గురువారం ఆయన జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి హరిబాబు నేతృత్వంలో స్థానిక బలగ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, రాగోలు జేమ్స్ ఆసుపత్రులను సందర్శించారు. మానసిక రోగులుతో ప్రత్యేకంగా మాట్లాడారు.

సంబంధిత పోస్ట్