ఇచ్ఛాపురం మండలం బూర్జపాడు గ్రామానికి చెందిన 15 ఏళ్ల యోగి అనే బాలుడు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. ఇంట్లో హైబీపీ రావడంతో కుప్పకూలిపోయిన అతన్ని శ్రీకాకుళంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. తండ్రి విదేశాల్లో ఉండటంతో తల్లి కన్నీరుమున్నీరుగా రోదిస్తూ కుమారుడికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన స్థానికులను కలచివేసింది.