శ్రీకాకుళం జిల్లాలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా డిసెంబర్ 31న మద్యం విక్రయాలు జోరుగా సాగాయి. ఈ అమ్మకాల ద్వారా రూ.3.75 కోట్ల ఆదాయం వచ్చినట్లు జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారి సీహెచ్ తిరుపతిరావు తెలిపారు. జిల్లాలో 176 మద్యం షాపులు, 9 బార్లలో ప్రభుత్వ నిబంధనల మేరకు అమ్మకాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు.