శ్రీకాకుళం: ఆదిత్యుని దర్శించుకున్న పంచాయతీరాజ్ కమిషనర్
గురువారం ఉదయం శ్రీకాకుళం అరసవిల్లిలోని శ్రీ సూర్యనారాయణ స్వామివారిని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ కృష్ణ తేజ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామిని దర్శించుకోవడం ఇదే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. అర్చకులు ఆయనకు స్వామివారి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.
