శ్రీకాకుళం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ భుక్త బలరాం మంగళవారం అర్ధరాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్ఛాపురం ప్రాంతానికి చెందిన బలరాం, గంజాయి కేసులో రిమాండ్‌లో ఉన్నాడు. ఈ నెల 6వ తేదీన సబ్ జైలుకు వచ్చిన అతను, 7వ తేదీన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జైలు అధికారుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై ఆర్డిఓ సాయి ప్రత్యూష విచారణ చేపట్టారు, వివరాలు సేకరించారు.