ఆదివారం జిల్లా కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అనిత మాట్లాడుతూ, పల్స్ పోలియో చుక్కలతో అంగవైకల్యాన్ని నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు అందజేశారు. ఈరోజు సాయంత్రం వరకు శిబిరాలు కొనసాగుతాయని, మిగిలిపోయిన వారికి రేపు, ఎల్లుండి ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తామని ఆమె వివరించారు.