ఆదివారం శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్వీయ జనాభా గణనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, ఎమ్మెల్యే శంకర్రావు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న జనాభా గణనలో ప్రజలు చురుగ్గా పాల్గొని, సమాచార సేకరణకు వచ్చే సిబ్బందికి సహకరించాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు కూడా పాల్గొన్నారు.