శ్రీకాకుళం సన్ డిగ్రీ కళాశాలలో శుక్రవారం జరిగిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా నైపుణ్యా అభివృద్ధి సంస్థ అధికారి ఉరిటి సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మేళాలో వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 595 మంది ఇంటర్వ్యూలకు హాజరుకాగా, వీరిలో 261 మంది వివిధ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. జిల్లా ఎంప్లాయిమెంట్ అధికారి కే సుధా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.