శ్రీకాకుళం రోడ్డు ట్రాన్స్‌ఫోర్ట్ కార్యాలయం పరిధిలోని పలు ప్రాంతీయ కార్యాలయాల్లో సంబంధిత శాఖకు చెందిన సర్వర్ బుధవారం మొరాయించింది. వివిధ రకాల వాహనాల లైసెన్సులకు ఇవాళ స్లాట్ బుక్ చేసుకున్న (దరఖాస్తు చేసుకున్న) వినియోగదారులు ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 11 గం.ల వరకు సర్వర్ పని చేసింది. తర్వాత కొంతసేపు సర్వర్ పనిచేయకపోవడంతో పనినిమిత్తం వచ్చిన వారు తిరిగి వెళ్లిపోయారు.