శ్రీకాకుళం సీతారామస్వామి దేవాలయం: 1802 నాటి చారిత్రక వైభవం

12చూసినవారు
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలంలోని గుళ్ల సీతారాంపురం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ సీతారామస్వామి దేవాలయానికి విశేషమైన చరిత్ర ఉంది. పూర్వంలో దట్టమైన అటవీప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో వేటకు వచ్చిన ఇనుగంటి వంశస్థుడు రాజుగారికి స్వప్నంలో శ్రీస్వామివారు దర్శనమిచ్చి ఆలయం నిర్మించమని ఆదేశించారట. ఆదేవుడి ఆజ్ఞతో వెలిసిన స్వామివారిని జేష్ఠ శుద్ధ ఏకాదశినాడు ప్రతిష్ఠించారు. అనంతరం 1802లో బొబ్బిలి మహారాజు శ్రీ రావు రాయడప్ప రంగారావు బహుదూర్ ఈ ఆలయాన్ని నిర్మించారు. అప్పటి నుండి పంచరాత్ర ఆగమ పద్ధతిలో పూజలు, ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్తుల విశ్వాస కేంద్రంగా నిలిచిన ఈ దేవాలయం నేటికీ ఆధ్యాత్మిక కాంతి ప్రసరిస్తోంది.

ట్యాగ్స్ :