ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కొండ శ్రీనివాసరావు బుధవారం శ్రీకాకుళంలో మాట్లాడుతూ, నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతోందని, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వేలాదిమంది నిరుద్యోగులు విద్య పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని, నిరుద్యోగ సమస్యను తక్షణమే పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.