శ్రీకాకుళం: సప్లమెంటరీ ఇంటర్ పరీక్షలు వాయిదా.. ఆర్ ఐ ఓ

0చూసినవారు
శ్రీకాకుళం: సప్లమెంటరీ ఇంటర్ పరీక్షలు వాయిదా.. ఆర్ ఐ ఓ
జిల్లాలో జరుగుతున్న ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను వాయిదా వేసినట్లు ఆర్ఐఓ ఎం కృష్ణవేణి తెలిపారు. మంగళవారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో, ఈ నెల 28న జరగాల్సిన ప్రథమ ఇంటర్ ఎకనామిక్స్, ద్వితీయ ఇంటర్ జనరల్ మ్యాథమెటిక్స్ పరీక్షలు వాయిదా పడ్డాయని పేర్కొన్నారు. బక్రీదు పండుగ సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన సెలవు కారణంగా, ఈ పరీక్షలను వచ్చే నెల 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్