శ్రీకాకుళం జిల్లాలో పలు చైన్ స్నాచింగ్ కేసులలో ఇద్దరిని అరెస్టు చేశామని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సుజిత్ కుమార్ పాడి, బాలకృష్ణ సాహూ వీరిద్దరూ జిల్లాలోని కొత్తూరు, మందస, ఎచ్చెర్ల, కోటబొమ్మాలి మండలాలలో చైన్ స్నాచింగ్ కేసులలో గురువారం సాయంత్రం వీరిని అదుపులోకి తీసుకోని అరెస్ట్ చేసామన్నారు.