శ్రీకాకుళం రూరల్ మండలం కల్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి అన్ని విధాలా కృషి చేస్తామని, స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోండు శంకర్రావు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ కూడా పాల్గొన్నారు.