శ్రీకాకుళం రూరల్ మండలం గనగళ్లవానిపేట సముద్ర తీర ప్రాంతాన్ని కేంద్ర విమానయాన శాఖామంత్రి కింజరాపు అచ్చం నాయుడు బుధవారం పరిశీలించారు. ఇటీవల తుఫాన్ కారణంగా తీరం కోతకు గురైందని, దీనిపై స్థానిక మత్స్యకారులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే శంకర్, జిల్లా అధికారులతో కలిసి తీర ప్రాంతాన్ని పర్యవేక్షించిన మంత్రి, నిధులు మంజూరు చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.