శ్రీకాకుళం మహిళా డిగ్రీ కళాశాలలో అదనపు తరగతి భవనాల ప్రారంభోత్సవానికి హాజరైన కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, బుధవారం ఉదయం విద్యార్థులను పలకరించడానికి వేదికపై కాకుండా నేరుగా వారి మధ్య నేలపై కూర్చున్నారు. ఈ ఆకస్మిక చర్యతో విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే గోండు శంకర్రావు కూడా పాల్గొన్నారు.