జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'జలధార-జలహారతి' పథకంలో మంజూరైన పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. బుధవారం శ్రీకాకుళం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జలధార ప్రాజెక్టుల పురోగతిపై డ్వామా, ఇరిగేషన్, మండలస్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో మండలాల వారీగా పనుల ప్రగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు.