కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు బుధవారం రాత్రి శ్రీకాకుళంలో తన స్వగృహంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, కేంద్ర ఏవియేషన్ కేంద్రాల్లో మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విమానయాన రంగంలో మహిళలకు అనేక అవకాశాలున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళలతో ఆయన సమావేశమయ్యారు.