శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న అసిరి తల్లి ఉత్సవాలలో భాగంగా నిర్వహించనున్న శోభాయాత్రకు ఎటువంటి ఆటంకాలు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి వేళల్లో కూడా పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. శోభాయాత్ర జరిగే వీధుల్లోని కాలువలపై సిమెంట్ పలకలు వేసే పనులను కార్మికులు వేగంగా పూర్తి చేస్తున్నారు. శోభాయాత్రలో పాల్గొనే భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.