బాలికలతో కాళ్ళు నొక్కించుకున్న టీచర్.. విచారణకు ఆదేశం

3చూసినవారు
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఒక ఉపాధ్యాయురాలు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకున్న ఘటన వెలుగుచూసింది. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ, ఇద్దరు విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న ఉపాధ్యాయురాలు సుజాత తీరుపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, విచారణకు ఆదేశించారు.

సంబంధిత పోస్ట్