మెలియాపుట్టి మండలం చాపర ZPHS 9వ తరగతి విద్యార్థి, హీరాపురానికి చెందిన జ్ఞానసాయి, దివ్యాంగుడైనప్పటికీ ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించి తన సత్తా చాటాడు. గండికోటలోని అడ్వెంచర్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొంది, క్రీడల్లో ప్రతిభ కనబరిచి, ప్రత్యేక అవసరాలున్నవారిని తక్కువ అంచనా వేయకూడదని నిరూపించాడు.