గార మండలంలోని శాలిహుండం కొండపై వెలసిన ఖాళీయ మర్దన వేణుగోపాల స్వామి ఆలయ జాతర గురువారం ముగిసింది. శుక్రవారం ఆలయ ట్రస్టు బోర్డు ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు జరిగింది. ఈ లెక్కింపులో సుమారు 20 మంది సభ్యులు పాల్గొన్నారు. పూర్తి వివరాలను సాయంత్రం వెల్లడిస్తామని ట్రస్ట్ బోర్డ్ సభ్యులు తెలిపారు. ఈ సంఘటన శ్రీకాకుళంలో జరిగింది.