ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. జిల్లాలోని పలు ప్రాంతాలలో నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు విభిన్న వాతావరణ పరిస్థితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వర్షాల సమయంలో ప్రజలు బయట తిరగకూడదని హెచ్చరించారు.