శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే 20 రైళ్లను ఈస్ట్ కోస్ట్ రైల్వే రద్దు చేసింది. అయితే, మంగళవారం రైల్వే జీఎం పరమేశ్వర ఒక ప్రకటనలో ఈ రైళ్లను తిరిగి పునరుద్ధరించినట్లు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులు సూచించారు.