ఆమదాలవలస పట్టణంలోని విజయభవని ఆలయాన్ని మంగళవారం టీటీడీ వేద పండితులు కృష్ణ సాయి శర్మ దర్శించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ఆయనకు ఘన స్వాగతం పలికి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ నిర్వాహకులు ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నేత మొదలవలస రమేష్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక భక్తులు పాల్గొన్నారు.