వజ్రపుకొత్తూరు మండలం బెండి పంచాయతీ బట్టుపాడు గ్రామానికి చెందిన సీనియర్ న్యాయవాది కొర్ల మన్మధరావు (50) గురువారం కిడ్నీ వ్యాధితో మృతి చెందారు. 2020లో కరోనా సోకినప్పటి నుండి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, కోవిడ్ ప్రభావంతో గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలతో సతమతమయ్యారు. గత 3 రోజులుగా తీవ్ర అనారోగ్యంతో పలాస-కాశీబుగ కిడ్నీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.