
అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధం చేస్తూ పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లుకు ఉభయ సభలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ఈ బిల్లు ఆమోదం పొందడంతో అమరావతికి చట్టబద్ధత లభించింది. ఈ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.




