శ్రీకాకుళంలో తాగునీటి పైప్‌లైన్ లీక్, నీటి వృధాతో గ్రామస్థుల ఆందోళన

3చూసినవారు
శ్రీకాకుళం రూరల్ మండలం SS వలస గ్రామంలో తాగునీటి పైప్‌లైన్ లీక్ అవడంతో భారీగా నీరు వృధా అవుతోంది. గత కొన్ని రోజులుగా పైపు దెబ్బతినడంతో నిరంతరంగా నీరు కారిపోతుండటంపై గ్రామస్థులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ రోజువారీ అవసరాలకు తాగునీరు అందక ఇబ్బందులు పడుతున్నామని, పైప్‌లైన్ మరమ్మతులకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. సమస్యను పలుమార్లు సంబంధిత విభాగానికి తెలియజేసినా స్పందన రాలేదని స్థానికులు తెలిపారు. తక్షణమే పైప్‌లైన్‌ను సరిచేసి తాగునీటి వృధాను అరికట్టి, గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్