కొత్తూరు-వాడాడ రహదారిపై పిచ్చిమొక్కలు, ప్రయాణికులకు ఇక్కట్లు

1చూసినవారు
శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని కొత్తూరు నుండి వాడాడ గ్రామానికి వెళ్లే రహదారి ఇరువైపులా పిచ్చిమొక్కలు విస్తారంగా పెరిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా ఈ మొక్కలు మరింతగా పెరిగి, దారి సన్నగా మారిపోయింది. దీంతో వాహనాలు వెళ్లడానికి ఇబ్బంది కలుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, ఈ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్