
ఇండిగో సంక్షోభం: ప్రయాణికులకు ఇబ్బందులుంటే సహించం - రామ్మోహన్ నాయుడు
శ్రీకాకుళం ఎం.పి. మరియు పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు లోక్ సభలో ఇండిగో సంక్షోభంపై కీలక ప్రకటన చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించే ఏ విమానయాన సంస్థనైనా సహించబోమని ఆయన హెచ్చరించారు. ఎయిర్‌పోర్టుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తున్నాయని, రిఫండ్, లగేజీ పంపిణీ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. డీజీసీఏ ఇప్పటికే ఇండిగో సంస్థకి షోకాజ్ నోటీసులు పంపి దర్యాప్తు ప్రారంభించిందని, భద్రత విషయంలో రాజీ పడేది లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.


































