శ్రీకాకుళం నగరంలో మంగళవారం తెల్లవారుజాము నుంచి తీవ్రమైన చలిగాలులు వీచాయి. దీనితో ప్రధాన రహదారులు నిర్మానుష్యంగా మారాయి. మంచు కురవడంతో సూర్యోదయం ఆలస్యమైంది. ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరో మూడు రోజుల పాటు చలిగాలులు కొనసాగుతాయని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.