శ్రీకాకుళంలో దట్టమైన పొగమంచు: వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు

2చూసినవారు
శ్రీకాకుళం నగరం మీదుగా వెళుతున్న జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచు కమ్మేయటంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పది గంటలైనా మంచు తెరలు వీడకపోవడంతో, వాహనదారులు లైట్లు ఆన్ చేసుకొని, తక్కువ వేగంతో వెళ్లాలని హైవే పెట్రోల్ అధికారులు హెచ్చరిస్తున్నారు. జనవరి నెలాఖరు వరకు చలి, పొగమంచు ప్రభావం కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలియజేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్