టెక్కలి నుంచి విశాఖ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు విషయంలో ప్రయాణికుల మధ్య గురువారం వాగ్వాదం చోటుచేసుకుంది. టెక్కలి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఒక మహిళ ప్రయాణికుడితో గొడవకు దిగింది. చుట్టుపక్కల ప్రయాణికులు జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.