నాగావళి నదిలో ప్రమాదకర స్థాయికి వరద నీరు, జిల్లా యంత్రాంగం అప్రమత్తం

6చూసినవారు
ఒడిస్సా క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షాల కారణంగా నాగావళి నదిలోకి వరద నీరు ఆందోళనకరంగా వచ్చి చేరుతోంది. నేటి మధ్యాహ్నం నాటికి ఇన్ ఫ్లో 32,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 32,600 క్యూసెక్కులుగా నమోదైంది. దీంతో శ్రీకాకుళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమై, నది పరీవాహక గ్రామాలను అప్రమత్తం చేసింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని ప్రత్యేక అధికారి చక్రధర్ బాబు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్