కోట బొమ్మాలి: ఆపద సమయంలో శక్తి యాప్ తో రక్షణ

0చూసినవారు
ఆదివారం కోటబొమ్మాలి మండల కేంద్రంలోని రైతుబజార్ వద్ద స్థానికులకు శక్తి యాప్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శక్తి టీం హెచ్ సి గిరిధర్ మాట్లాడుతూ, ఆపద సమయంలో ఎల్లప్పుడూ శక్తి యాప్ రక్షణగా నిలుస్తుందని తెలిపారు. 112 కు ఫోన్ చేస్తే తక్షణమే సహాయం అందుతుందని, శక్తి యాప్ ఉంటే ఒక పోలీస్ మీకు రక్షణగా ఉన్నట్లేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్